Jack Ma

 



జాక్ మా

వ్యాపారవేత్త


జాక్ మా చైనాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త. ఆలీబాబా.కామ్‌ ఇ-కామర్స్ పోర్టల్ అధినేత. చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

జాక్ మా (Jack Ma)
Jack Ma 2008.jpg
2008, ప్రపంచ ఆర్థిక సదస్సు లో జాక్ మా
జననం
మా యున్

1964 అక్టోబరు 15 (వయస్సు 57)
జాతీయతచైనా
విద్యాసంస్థహాంగ్జౌ విశ్వవిద్యాలయము
వృత్తిఅలీబాబా వ్యాపార సంస్థల ప్రారంభకుదు, అధిపతి
నికర విలువIncrease US $21.8 billion (2014)[1]
జీవిత భాగస్వామిజంగ్ యింగ్
పిల్లలు2

నేపధ్యము

జాక్ మా చిన్నప్పటి నుండే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. ఇతను 12 ఏళ్లపుడే ఆంగ్ల భాషను నేర్చుకోవడం మొదలుపెట్టాడు.[2] ఆంగ్లంలో కాస్త పట్టు సాధించాక సొంతూరుకి దగ్గర్లోని హాంగ్జౌ నగరంలోని ఒక హోటల్‌కు తొమ్మిదేళ్లపాటు రోజూ సైకిల్ మీద వెళ్లి... పర్యటనకోసం, వాణిజ్యం కోసం చైనా వచ్చే విదేశీయులకు గైడ్‌గా ఉచిత సేవలు అందించేవాడు. ఆంగ్లంలో తన నైపుణ్యాల్ని మెరుగు పరుచుకోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసేవాడు జాక్. గైడ్‌గా పనిచేసిన తొమ్మిదేళ్లలో జాక్‌లో ఎంతో మార్పు వచ్చింది. అతడు చైనాలో ఉంటూనే ప్రపంచాన్ని అర్థంచేసుకున్నాడు. గురువుల దగ్గరా, పుస్తకాల్లోనూ నేర్చుకున్నవాటికి భిన్నమైన అంశాల్ని విదేశీ పర్యటకుల నుంచి నేర్చుకున్నాడు. 1979లో జాక్ జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబం చైనా పర్యటనకు వచ్చినపుడు వారితో జాక్‌కు పరిచయం ఏర్పడింది. మూడు రోజులపాటు జాక్ వారితో ఆడుతూ పాడుతూ గడిపాడు. ఆ తర్వాత వారు జాక్‌కు కలం స్నేహితులు అయ్యారు. 1985లో ఆ కుటుంబం ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా వెళ్లి నెలరోజులపాటు అక్కడ కొత్త ప్రపంచాన్ని చూశాడు.

ఆంగ్ల ఉపాధ్యాయుడు అవ్వాలనే లక్ష్యంతో 'హాంగ్జౌ టీచర్స్ యూనివర్సిటీ' ప్రవేశ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో మూడోసారి సఫలీకృతుడయ్యాడు. అక్కడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆంగ్ల ఉపాధ్యాయుడు అర్హతకు అవసరమయ్యే విద్యను అభ్యసించాడు. అదే సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా, నగరంలోని విదార్థి సంఘం నాయకుడిగానూ ఎన్నికయ్యాడు. విద్య పూర్తిచేశాక అదే విశ్వవిద్యాలయంలో సుమారు రూ.1000 నెల జీతానికి పాఠాలు చెప్పేవాడు. అక్కడ జీతం సరిపోక పెద్ద హోటల్‌లో లేదంటే బహుళజాతి సంస్థలో ఉద్యోగిగా చేరాలనే లక్ష్యంతో ఉండేవాడు జాక్. అప్పుడే ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలించవచ్చనేది అతడి ఆలోచన. 1992 నాటికి చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు జాక్. అందులో కేఎఫ్‌సీ జీఎంకి సెక్రటరీ పోస్టు ఒకటి. కానీ అతన్ని ఎవరూ తీసుకోలేదు. దాంతో సొంతంగా అనువాద సంస్థను ప్రారంభించాడు.

జాక్ 1995లో చైనా వ్యాపార బృందంతో కలిసి దుబాసీగా అమెరికాలో పర్యటించాడు. అక్కడే జాక్ స్నేహితుడు మొదటిసారి ఇంటర్నెట్‌లో సమాచారం ఎలా వెతకాలో చూపాడు. అదో మాయలా అనిపించింది అతడికి. ఇద్దరూ యాహూలో సర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. దాన్నో అవకాశంగా తీసుకొని రూ.1.2లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్‌సైట్‌ని ప్రారంభించాడు.[3] అప్పటివరకూ జాక్ కీబోర్డుని కూడా తాకింది లేదు. ఇక పీసీలూ, ఈమెయిల్స్ వినియోగంలో అతడి ప్రతిభ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుకే తాను ప్రయాణం మొదలుపెట్టిన తీరుని 'ఒక గుడ్డివాడు గుడ్డిపులి మీద స్వారీ చేయడంలాంటిద'ని చెబుతాడు. అప్పట్నుంచీ జాక్ జీవితం ఇంటర్నెట్‌తో ముడిపడింది. తన వెబ్‌సైట్‌తో 'చైనా టెలికామ్' సంస్థ సైట్‌కి జాక్ గట్టి పోటీ ఇచ్చాడు. ఆ సమయంలో సుమారు కోటి రూపాయల పెట్టుబడితో సంస్థ పెడతాననీ కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. దాన్నో అవకాశంగా భావించి సరేనన్నాడు జాక్. 'కొత్త సంస్థ బోర్డులో ఆ జీఎమ్ మనుషులు అయిదుగురు, మేం ఇద్దరం ఉండేవాళ్లం. మేం ఏం చెప్పినా దానికి అడ్డుపుల్ల వేసేవారు. మా భాగస్వామ్యం ఏనుగుకీ, చీమకీ మధ్య భాగస్వామ్యంలా ఉండేది. లాభం లేదని సంస్థ నుంచి బయటకు వచ్చేశా' అంటాడు జాక్. అప్పుడే బీజింగ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించే అవకాశం వచ్చింది జాక్‌కి. కానీ సొంత సంస్థ ప్రారంభించాలనేది అతడి కల.

Previous Post Next Post