Amitabh Bachchan

 



అమితాబ్ బచ్చన్

సినీ నటుడు, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత


అమితాబ్ హరివంశ్ బచ్చన్ (జ.1942 అక్టోబరు 11) భారత సినీ  నటుడు. 1970లలో రిలీజైన జంజీర్, దీవార్ సినిమాలతో ప్రఖ్యాతి  పొందారు. తన పాత్రలతో భారతదేశపు మొదటి "యాంగ్రీ యంగ్ మాన్"గా ప్రసిద్ధి చెందారు. బాలీవుడ్ లో షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనే  బిరుదులను  కూడా పొందారు. నాలుగు  దశాబ్దాలలో దాదాపు 180 సినిమాలలో పని చేశారు ఆయన. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటునిగా ప్రఖ్యాతి గాంచారు. 1970, 80లలో అమితాబ్ ఆధిపత్యం కొనసాగింది. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు ఫ్రాంన్సిస్ ట్రుఫట్ భారతీయ సినిమాని "ఒన్ మాన్ ఇండస్ట్రీ"గా అభివర్ణించారు.

అమితాబ్ బచ్చన్(amitabh bachchan)
Amitabh Bachchan December 2013.png
2013 TeachAIDS ఇంటర్వ్యూ లో బచ్చన్
జననం
అమితాబ్ హరివంశ్ రాయ్ బచ్చన్

1942 అక్టోబరు 11 (వయస్సు 79)
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థషేర్ వుడ్ కళాశాల, నైనిటేల్ కిరోరిమల్ కళాశాల, ఢిల్లీ యూనివర్శిటీ[1]
వృత్తినటుడు, నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1969–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజయ బచ్చన్(1973)
పిల్లలు
తల్లిదండ్రులుహరివంశ్ రాయ్ బచ్చన్
తేజీ బచ్చన్
బంధువులుఅజితాబ్ బచ్చన్(సోదరుడు)
ఐశ్వర్యా రాయ్ బచ్చన్(కోడలు)
పురస్కారాలుIND Padma Vibhushan BAR.png పద్మ విభూషన్ 2015[2]
IND Padma Bhushan BAR.png పద్మభూషణ్ 2001
IND Padma Shri BAR.png పద్మశ్రీ 1984
సంతకం
Amitabhbachchanji signature.svg

ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లోనూ ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. 15 ఫిలింఫేర్ అవార్డులు గెలుపొందారు.  ఉత్తమ నటుడు కేటగిరీకిగాను 40సార్లు నామినేట్ అయి ఫిలింఫేర్ కు అతి ఎక్కువ సార్లునామినేట్ అయిన నటుడు కూడా బచ్చనే. నటునిగానే కాక, నేపధ్య గాయునిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు ఆయన. 1980లలో రాజకీయాలలో కూడా క్రీయాశీలకంగా పనిచేశారు అమితాబ్.

1984లో భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, 2001లో పద్మ భూషన్ తోనూ, 2015లో పద్మవిభూషన్ తోనూ గౌరవించింది. 2007లో ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన "లెగియన్ ఆఫ్ హానర్"తో గౌరవించింది .

హాలీవుడ్ లో మొదటిసారి 2013లో "ది గ్రేట్ గేట్స్బే" అనే సినిమాతో అడుగుపెట్టారు బచ్చన్. జ్యియిష్ వ్యక్తి మేయర్ వోల్ఫ్ షిం అనే పాత్రలో నటించారయన. 

Previous Post Next Post