Che Guevara

 



చే గువేరా


ఏర్నెస్టో"చే" గువేరా (ఆంగ్లం: Che Guevara) (జూన్ 14, 1928 – అక్టోబరు 9, 1967) చే గువేరా , ఎల్ చే , చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.[4]

ఏర్నేస్తో "చే" గువేరా
June 14, 1928 – October 9, 1967
GuerrilleroHeroico.jpg
"Guerrillero Heroico"
Che Guevara at the La Coubre memorial service.

Taken by Alberto Korda on March 5, 1960.

పుట్టిన తేదీ:June 14, 1928[1]
జన్మస్థలం:RosarioArgentina
మరణించిన తేదీ:1967 అక్టోబరు 9 (వయస్సు 39)
నిర్యాణ స్థలం:బోలీవియా
ప్రధాన సంస్థలు:26th of July Movement, United Party of the Cuban Socialist Revolution,[2] en:National Liberation Army (Bolivia)
మతం:None[3]

యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు. ఈ పర్యటనలలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుదినిర్ణయానికి వచ్చారు,

దీనికి ఒకేఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు. ఈ నమ్మకం అతనిని అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ఆధ్వర్యంలోని గ్వాటిమాల యొక్క సాంఘిక సవరణలలో పాలుపంచుకునేందుకు ప్రేరణనిచ్చింది, అంతిమంగా అధ్యక్షునిపై CIA-ప్రోద్బలంతో జరిగిన పదవీచ్యుతి గువేరా యొక్క తీవ్రవాద భావజాలాన్ని దృఢపరచింది. తర్వాత మెక్సికో నగరంలో నివసిస్తున్నప్పుడు, అతను రౌల్, ఫిడేల్ కాస్ట్రోలను కలిసారు, వారి జూలై 26 ఉద్యమంలో చేరి, U.S.-మద్దతు ఇచ్చిన క్యూబా యొక్క నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పదవీచ్యుతిని చేసేందుకు, గ్రాన్మాను అధిరోహించి క్యూబాను ఆక్రమించారు. గువేరా త్వరలోనే విప్లవకారులలో ప్రముఖుడై, సైన్యంలో రెండవస్థానానికి పదోన్నుతుడై, బాటిస్టా పాలనను తొలగించడానికి చేసిన రెండు సంవత్సరాల గెరిల్లా పోరాటంలో ప్రముఖపాత్ర వహించారు.

క్యూబా తిరుగుబాటు తరువాత, గువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధానపాత్రలను పోషించారు. రెవల్యూషనరీ ట్రిబ్యునల్స్ లో యుద్ధ నేరస్థులుగా పరిగణింపబడిన వారియొక్క వినతులు, ఫైరింగ్ దళాలను సమీక్షించడం, పరిశ్రమలశాఖా మంత్రిగా వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనికదళాల బోధనానిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాదం తరపున దౌత్యవేత్తగా ప్రపంచపర్యటనలు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి.

ఈ విధమైన హోదాలు అతనిని బే ఆఫ్ పిగ్స్ దాడిని తిప్పికొట్టిన సైన్యానికి శిక్షణనివ్వడంలో, 1962 క్యూబన్ మిస్సైల్ సందిగ్ధతలో పాత్ర పోషించిన సోవియెట్ అణు-ఆయుధ బాల్లిస్టిక్ మిస్సైళ్ళను క్యూబాకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించేటట్లు చేసాయి. అంతేకాక, ఆయన ఒక నైపుణ్యంగల రచయిత, డైరిస్ట్, గెరిల్లా యుద్ధతంత్రంపై ఒక మూలాధార పుస్తకాన్ని రూపొందించారు, దానితో పాటు దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటర్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా అధిక ప్రజాదరణ పొందిన గ్రంథాన్నికూడా రచించారు. గువేరా 1965లో క్యూబాను వదలి కాంగో-కిన్షాసా లోను తరువాత బొలీవియాలోను యుద్దాలను ప్రేరేపించారు, అక్కడ ఆయన CIA-సహకార బొలీవియన్ దళాలతో బంధింపబడి ఉరితీయబడ్డారు.

గువేరా మంచిగా, చెడుగా కీరించబడ్దాడు. అసంఖ్యాకంగా వ్రాయబడిన జీవితచరిత్రలు, జ్ఞాపకాలు, వ్యాసాలు, డాక్యుమెంటరీలు, పాటలు, చిత్రాలలో భిన్న దృష్టికోణాలలో ధ్రువీకరించబడ్డారు. టైం మగజైన్ 20వ శతాబ్దపు 100మంది అతిప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయనను పేర్కొంది, అల్బెర్టో కొర్డా తీసిన ఆయన ఛాయాచిత్రం గ్యుఎర్రిల్లెరో హీరోఇకో (చూపించబడింది), "ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత ఫొటోగ్రాఫ్"గా ప్రకటించబడింది.

Previous Post Next Post