Kapil Dev


 


కపిల్ దేవ్

ప్రముఖ క్రికెట్ ఆటగాడు


కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ (హిందీ:कपिल देवభారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959జనవరి 6న ఛండీగఢ్ లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కపిల్ దేవ్
Kapil dev cropped.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలికుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలిరైట్-ఆర్మ్ ఫాస్ట్ మీడియం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు131225
పరుగులు52483783
బ్యాటింగ్ సగటు31.0523.79
100లు/50లు8/271/14
అత్యుత్తమ స్కోరు163175*
ఓవర్లు46231867
వికెట్లు434253
బౌలింగ్ సగటు29.6427.45
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు231
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు2n/a
అత్యుత్తమ బౌలింగ్9/835/43
క్యాచ్ లు/స్టంపింగులు64/-71/-

As of మార్చి 162008
Source: Cricinfo

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.

Previous Post Next Post