Michael Jackson


 

మైకల్ జాక్సన్


మైకల్ జోసెఫ్ జాక్సన్ (ఆగష్టు 29, 1958 - జూన్ 25, 2009) అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన మ్యూజిక్ ఆల్బమ్ "థ్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సరాల వయసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో ఒక భాగంగా ఉన్నాడు. 1970 ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అమెరికాలోని శ్వేతజాతీయుల మద్దతు పొందిన మొదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.

మైకల్ జాక్సన్
Michael Jackson 1984(2).jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంమైకల్ జోసెఫ్ జాక్సన్
ఇతర పేర్లుమెకల్ జో జాక్సన్
The King of Pop (పాప్ కి రాజు)
MJ
మూలంగారి, ఇండియానా, అమెరికా
మరణంజూన్ 25,2009
లాస్ ఏంజిలస్,కాలిఫొర్నియ,యు. స్. ఏ
సంగీత శైలిR&Bsoulpopdance-popdiscorockurban popfunkMotown
వృత్తిsingersongwriterrecord producerarrangerdancerchoreographeractor
వాయిద్యాలుVocalspercussionmultiple instruments
క్రియాశీల కాలం1967 - నేటివరకు
లేబుళ్ళుమోటౌన్, ఎపిక్, సోనీ, ద మైకల్ జాక్సన్ కంపెని ఇంకార్పొరేటెడ్
సంబంధిత చర్యలుద జాక్సన్ ఫైవ్, జేనెట్ జాక్సన్, క్వింసీ జోన్స్, సియెదా గర్రెట్ట్, టెడ్డీ రైలీ
వెబ్‌సైటుMichaelJackson.com

జాక్సన్ మొత్తం 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. 8 ఆవార్డులు ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. ప్రపంచ మొత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.[2] జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.[3]

కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్లో ఉన్నాడు. అక్కడ ఒక జూ, అమ్యూజ్‌మెంట్ పార్క్ కట్టించాడు. కేన్సర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలను అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008 నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.

Previous Post Next Post