N. T. Rama Rao


 


నందమూరి తారక రామారావు

తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి


నందమూరి తారక రామారావు (మే 281923 - జనవరి 181996) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్.టి.రామారావు గారు తెలుగుతమిళంహిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు. రాముడుకృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

నందమూరి తారక రామారావు
NT Rama Rao.jpg
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ N.T.రామారావు
జననంనందమూరి తారక రామారావు
1923 మే 28 [1]
భారత దేశం నిమ్మకూరుకృష్ణా జిల్లాఆంధ్ర ప్రదేశ్భారత దేశం
మరణంజనవరి 181996
భారత దేశం హైదరాబాదుఆంధ్రప్రదేశ్భారత దేశం
నివాస ప్రాంతంహైదరాబాదు,తెలంగాణ
ఇతర పేర్లువిశ్వ విఖ్యాత నట సార్వభౌమ
ఎన్.టి.ఆర్
అన్నగారు
వృత్తిసినిమా నటుడు
సినిమా దర్శకుడు
నిర్మాత
రాజకీయ నాయకుడు
రంగస్థల నటుడు
ఎత్తు5' 10"
బరువు78
తర్వాత వారుచంద్రబాబు నాయుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
మతంహిందూ
భార్య / భర్త
(m. 1942; died 1985)

(m. 1993; died 1996)
పిల్లలుజయకృష్ణ
సాయికృష్ణ
హరికృష్ణ
మోహనకృష్ణ
బాలకృష్ణ
రామకృష్ణ
జయశంకర్ కృష్ణ
గారపాటి లోకేశ్వరి
దగ్గుబాటి పురంధేశ్వరి
నారా భువనేశ్వరి
కంటమనేని ఉమామహేశ్వరి[1]
తండ్రిలక్ష్మయ్య చౌదరి
తల్లివెంకట్రావమ్మ

రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలిచాడు.

Previous Post Next Post